ఈ అవార్డుని మార్చి నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఈ ఎంపిక దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కలిసి ఎంపిక చేస్తారు. గతంలో ఇలాంటి అవార్డు అశ్విని వైష్ణవ్ (2024), నిర్మలా సీతారామన్ (2021), మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర (2019), ఎస్ జై శంకర్ (2023), కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) వంటి వారికి ఈ అవార్డులు లభించాయి. చాలామంది నేతలు, మంత్రుల సైతం సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదే కాకుండా ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు కుటుంబానికి కూడా వరుసగా అవార్డులు లభించాయి. గత నెలలో సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వర్ కి విస్టింగ్వీష్డ్ ఫెలోషిప్ (2025) అవార్డుని అందుకున్నారు. అలాగే నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈమెకు కూడా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నది. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే అందించేటువంటి "మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్" బిజినెస్ అవార్డును ముంబై వేదికగా బ్రాహ్మణికి ఈ అవార్డు అందించడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి