తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసిఆర్ పాలించారు. ఆయన తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పాలన సౌలభ్యాన్ని చాలా ఈజీగా చేసేసారు.. అలాంటి ఈ తరుణంలో మూడో దఫా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేసీఆర్ చేసిన జిల్లాలను తొలగించి పాత జిల్లాల ప్రకారమే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాలలో 16 జిల్లాలు క్యాన్సల్ కాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే వివరాలు చూద్దాం.. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారమే జిల్లాల క్రమబద్ధీకరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో చేసినటువంటి ప్రతిపాదన ఆధారంగానే కొత్త జిల్లాలు ఉంటాయని సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా మాట్లాడుతున్నారు... 

ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇక మిగిలేది 17 జిల్లాలు మాత్రమే. ఈ తరహాలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏవిధంగా జిల్లాలు ఉన్నాయో ఆ విధంగానే ప్రస్తుతం తెలంగాణలో కూడా జిల్లాలు ఉండబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీనికోసం ఇప్పటికే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో అభ్యంతరాల స్వీకరణ కూడా చేపట్టబోతున్నారట.. ఈ బృందం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అభీష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా సర్వే చేసి ఆరు నెలల్లో ఆ రిపోర్టును ప్రభుత్వ వర్గాలకు అందజేయబోతున్నట్లు సమాచారం.. ఒకవేళ జిల్లాలు క్యాన్సల్ అయితే మాత్రం ముఖ్యంగా సిరిసిల్ల,సిద్దిపేట, వనపర్తి,సూర్యాపేట, భద్రాద్రి,ములుగు తదితర జిల్లాలు రద్దు కాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇందులో సగం ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రిలోకి రాబోతున్నాయని, మరికొన్ని మహబూబాబాద్ భద్రాద్రిలోకి విలీనం అవుతాయట. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని  మండల కేంద్రాలు,జిల్లా సరిహద్దులు కార్యాలయాలు కూడా పూర్తిగా మారబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఇదంతా పూర్తయిన తర్వాత ఉద్యోగ నియామకాలు కొత్త జోనల్ సిస్టం ని ప్రతిపాదించే అవకాశం కూడా ఉన్నదని సమాచారం.. మరి కాంగ్రెస్ హయాంలో ఇదంతా సాధ్యమవుతుందా.. దీనివల్ల కాంగ్రెస్ కు మేలు కలుగుతుందా.. ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: