రాష్ట్ర విభజన అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన ఖాయమంటూనే... ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందంటూ వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ను వదులుకునేది లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కనీసం పదేళ్లు ఉమ్మడి రాజధాని అంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు. ఆ ప్రతిపాదనను అంగీకరించేందుకు తెలంగాణవాదులు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. సీమాంధ్ర మంత్రుల ప్రకటనల వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని హరీష్ రావు అరోపించారు. ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉందని... 17న సీమాంధ్ర నేతల సమావేశానికి హైదరాబాద్ లో ఎలా అనుమతి ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రకటనల వల్ల... ఈ ప్రాంతంలో ఏం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని హరీష్ హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: