చక్కెర ధర వింటేనే నాగులో నాగన్న..నాకు చెక్కరొచ్చినట్లాయే నాగులో నాగన్న.. అన్నాడు ఓ విప్లవ గాయకుడు.. మూడు దశబ్దాల క్రితమే చక్కెర ధర పెరుగడం గూర్చి కవి ఆనాడే గళం విప్పారు. నిత్యవసర ధరల పెరుగుదలో పాటు ధరల పెరుగుదల గూర్చి ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లే జరుగుతుంది. నెల రోజుల్లోనే చక్కెర ధర 10రూపాయల వరకు పెరిగిపోయింది. నెల రోజుల క్రితం చక్కెర ధర కిలోకు 30 రూపాయలుంటే ప్రస్థుత ధర 40రూపాయలకు పెరిగిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చక్కెర వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. ఇంటికి వచ్చిన వారికి టీ ఇవ్వడం మర్యాదగా వస్తున్నటువంటి ఆచారం. ఇటువంటి పరిస్థితిలో చక్కెర వినియోగం పెరుగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా కొన్ని సంవత్సరాల నుండి వర్షాలు కురియక పోవడంతో చెరుకు విస్తిర్ణం తగ్గపోయింది. దీంతో మార్కెట్లో చక్కెర ధర ఎక్కువగా పెరిగిపోయింది. కాగా చౌకధరల దుకాణాల ద్వారా అర్హులైన వారికి అందించే చక్కెర నామమాత్రంగా ఉండడంతో అన్ని వర్గాల వారు బయట మార్కెట్ లోనే చక్కెరను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ధర పెరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: