హైదరాబాద్: తెలంగాణ మార్చ్ కు కేవలం 48గంటలు మాత్రమే మిగిలింది. గణేష్ నిమిజ్జనం, అంతర్జాతీయ జీవ వైవిధ్యసదస్సును ద్రుష్టిలో పెట్టుకుని రాష్ర్ట సర్కార్ మార్చ్ కు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణవాదులు హైదరాబాద్ కు రాకుండా, మార్చ్ ను నిర్వహించనీయకుండా చేసేందుకు కిరణ్ సర్కార్ సుమారుగా 50వేల మంది పోలీసు బలగాలను మోహరింపచేసింది. ఇంకా అవసరం అనుకుంటే మరిన్ని బలగాల్ని కూడా కిరణ్ సర్కార్ తెప్పించుకునే పనిలో ఉన్నది. గణేశ్ నిమిజ్జనం, జీవవైవిధ్యసదస్సుకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండేందుకు సర్కార్, పోలీస్ యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యల్ని తీసుకుంది.  తెలంగాణ వ్యాప్తంగా కూడా కేంద్రం నుంచి రప్పించిన పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పోలీసే కనిపిస్తున్నాడు. అడుగడుగునా తుపాకీ పట్టిన పోలీసే. అసెంబ్లీ, సచివాలయం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండా నిషేధాన్ని విధించారు. ఈ ప్రాంతంలో 144సెక్షన్ విధించారు. సచివాలయ చరిత్రలోనే 144సెక్షన్ విధించడం తొలిసారి. దీన్ని బట్టి పోలీస్ ఎంత కఠినంగా వ్యవహారిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నగరంతో పాటు తెలంగాణ జిల్లాలన్నీ పోలీస్ బలగాలతో నిండిపోయింది. తెలంగాణ అంతా ఇప్పుడు పోలీస్ గుప్పిట్లోనే వుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ చుట్టూ పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు వచ్చే ప్రతి వాహనాన్న క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే పంపిస్తున్నారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తసుకుంటున్నారు. తెలంగాణ జిల్లాలోని పల్లెల్లోయితే పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లలోకి చోరబడి మరీ తనిఖీలు చేస్తున్నరు. ఎమ్మెల్యేల్ని కూడా వదలడం లేదు. గతంలో ఎన్నడూ కూడా ఇంతగా పోలీసుల్ని దించిన దాఖలాలు లేవు. రాష్ర్టంలోని పోలీస్ బెటాలియనే కాకుండా, కేంద్రం కూడా వివిధ రకాల బెటాలియన్లు హైదరాబాద్ కు పంపించారు. ట్యాంకుబండ, నెక్లెస్ రోడ్డుపైనే తెలంగాణ మార్చ్ ను నిర్వహించి తీరుతామనీ జేఏసీ భీష్మించుకుని కూర్చోంది. పోలీస్ యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. జేఏసీ మాత్రం చేసి తీరుతామనీ అంటోంది. దీనితో పోలీసులు కూడా తమ పని తాము చేసుకుని పోతున్నారు. హైదరాబాద్ చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తెలంగాణవాదులు అనుమానం కలిగిందంటే చాలు... అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ కు బయలుదేరిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును కూడా అడ్డుకుని వెనక్కి పంపించేశారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో ఇదే పరిస్థితి. ఇక... జిల్లాల్లో వందలమందిపై బైండోవర్ కేసులు పెడుతున్నారు. ముందస్తు అరెస్టులూ చేస్తున్నారు. పోలీసుల ఎత్తుకు తెలంగాణవాదులు పైఎత్తులు వేసుకుంటున్నారు. హైదరబాద్ వకు వచ్చి మార్చ్‌ ను నిర్వహించి తీరుతామనీ, తెలం‘గానం’ తడాఖా చూపిస్తామనీ తెలంగాణవాదులంటున్నారు. మొత్తానికి తెలంగాణ అంతటా పోలీస్ బలగాలు మోహరించాయి. ఎప్పుడేమీ జరుగుతుందో తెలియని పరిస్థితి. గణేష్ నిమజ్జనంతో రేపు, ఎల్లుండి జంటనగరాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా వారి ప్రయణాన్ని వాయిదా వేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: