హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ ఛైర్మన్ కోదండరాం-టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మధ్యన విభేదాలు వచ్చాయనీ...కేసీఆర్ కోదండరాం ముఖం కూడా చూడటానికి ఇష్టపడటం లేదనీ లోకం కోడై కూస్తోంది. కానీ, కోదండరాం మాత్రం తమ మధ్యన ఎలాంటి విభేదాలు లేవనీ...మనస్పర్ధలన్నీ మీడియా దుష్ర్పచారమే అంటున్నారు. కోదండరాం చేసిన వ్యాఖ్యలో నవ్వాలో, ఏడ్వాలో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణ మార్చ్ అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన కేసీఆర్‌ను కలిసేందుకు టీజేఏసీ ఛైర్మన్ గా కోదండరాం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కేసీఆర్‌ను కలిసి మాట్లాడేందుకు రెండ్రోజుల ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిన విషయం జగమెరిగిన సత్యం. టీజేఏసీ ఛైర్మన్‌ను కలవడం ఇష్టం లేనీ కేసీఆర్ ఇంట్లో ఉండి కూడా కలువని విషయాన్ని ఏమనలో ప్రొఫెసర్ అయిన కోదండరాం చెబితేనే బాగుంటుంది.
ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ వద్దకు తెలంగాణ ఉద్యోగ సంఘానికి చెందిన పలువుర్ని పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్ కోదండరాంను మాత్రం పిలువలేదు. ఎలాగైనా టీజేఏసీ ఛైర్మన్ పదవీ నుంచీ కోదండరాంను తప్పించాలనే గట్టిపట్టుదలతోనే కేసీఆర్ ఉన్నాడనీ వార్తలొచ్చాయి. అయినప్పటీకీ కోదండరాం మాత్రం తమ మధ్యన మంచి సంబంధాలున్నాయనీ, ఉద్యమాన్ని బలహీనపర్చడానికి సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారనీ అంటున్నారు. తాను కేసీఆర్ తో మాట్లాడినట్లు కూడా కోదండరాం చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై కేసీఆర్ చెబితే కాస్త స్పష్టంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు సీమాంధ్ర పాలకులు, గుప్పెడు మంది పెట్టుబడిదారులు కుట్రలను పన్నుతున్నారనీ, వాటిని తాము తిప్పికొడుతామని ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారాయన.
అయితే, కోదండరాం చెబుతున్నట్లుగా తమ మధ్యన ఎలాంటి విభేదాల్లేనే విషయాన్ని కేసీఆర్ చెబితే తప్ప ఎవరూ నమ్మే పరిస్థితులు లేవు. కేసీఆర్ ఆ మాట చెప్పనంత కాలం కేసీఆర్-కోదండరాం మధ్యన విభేదాలున్నాయనీ ...ఇద్దరి మధ్యన చెప్పలేనంతగా అగాధం పెరిగిందనీ మీడియాలో వార్తలొస్తూనే ఉంటాయి. ఈ విషయంలో కేసీఆర్ స్పష్టత ఇచ్చిన రోజే ఇలాంటి వార్తలకు తావుండదు.
మరింత సమాచారం తెలుసుకోండి: