అనగనగా ఒకరోజు తాబేలు, పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడు తాబేలు, పక్షి ని .."నువ్వు ఎక్కడ ఉంటావు.. నీ ఇల్లు ఎక్కడ ఉంది.." అని అడిగింది. ఇక అప్పుడు పక్షి ,ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడుని చూపించింది. కర్ర పుల్లలతో చేసి ఉంది కదా..! అని అంది తాబేలు. అవును.. అదే నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా. దాని కన్నా నా డొప్పే చూడడానికి బాగుందే అంది తాబేలు ఎగతాళిగా.

ఇక పక్షి ఏమి మాట్లాడలేదు. ఎండ వచ్చినా, వాన వచ్చినా అన్ని గూటిని తాకుతాయి.. అనుకుంటా.. అందులో నువ్వు ఎలా ఉంటావో..? ఏమో..? నేనైతే ఎండ వచ్చినా..? వానా  వచ్చినా..? ఇంకా ఏ ప్రమాదం వచ్చిన సరే..? నా డొప్ప లోపలకి వెళ్ళిపోతాను. అప్పుడు నాకేం ఇబ్బంది ఉండదు అని గొప్పలు పోతూ చెప్పింది తాబేలు.

అప్పుడు పక్షి.. ఇది నేను సొంతంగా నిర్మించుకున్నాను. అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టం. నీ డొప్ప లోపల నువ్వు మాత్రమే వుండగలవు. కానీ నా ఇంట్లో నేను ,నా భార్య, నా పిల్లలు అందరం సంతోషంగా కలిసి ఉండగలము. అందుకే నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది పక్షి. ఇక పక్షి చెప్పిన మాటల్లో దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించిన తాబేలు, తర్వాత నుంచి ఎదుట పడిన ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి
మాట్లాడ లేదు. అంతే కాదు ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకుండా ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ప్రయత్నం చేసింది.

పక్షులు , జంతువులు తమ అభిప్రాయాలను మార్చుకొని , ఒకరికొకరు సంతోషంగా జీవిస్తుంటే, అన్నీ తెలిసి ,ఎంతో విజ్ఞానం కలిగిన మనుషులు ఎందుకు ఇలా ఉండలేకపోతున్నారు..? మనిషి మారితే ఈ సమాజం కూడా ఖచ్చితంగా మారుతుంది. పేద , ధనిక అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించసాగుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: