గత కొంత కాలం నుంచి భారత స్టార్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళ వరకు వీరి ప్రేమ విషయాన్ని ఎంతో సీక్రెట్ గా ఉంచిన కేఎల్ రాహుల్ ఇక ఇటీవల మాత్రం బయట పెట్టేసాడు. దీంతో గత కొన్ని రోజుల నుంచి వీరి పెళ్లి జరగబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.



 ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లో కె.ఎల్.రాహుల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. ఇక వీరి పెళ్ళి ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు ఇటీవల కె.ఎల్.రాహుల్ తల్లిదండ్రులు అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టిని కలిశారని ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఈ రెండు కుటుంబాలు కలిసి రాహుల్ అతియా జంట పెళ్లి చేసుకున్న తర్వాత ఉండబోయే ఒక కొత్త ఇంటిని కూడా సందర్శించినట్లు తెలుస్తుంది. అక్కడే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ కూడా అతియా శెట్టి స్వయంగా చూసుకుంటున్నారూ అనేది తెలుస్తుంది.


 ఇక క్రికెట్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ముందు కె.ఎల్.రాహుల్ గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే   గజ్జల్లో గాయం కారణంగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కు దూరమైన కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న వరుస సిరీస్ లకు కూడా దూరమయ్యాడు. ఇక ఇటీవల కె.ఎల్.రాహుల్ చికిత్స కోసం జర్మనీ వెళ్లగా అక్కడ శస్త్రచికిత్స విజయవంతం అయింది. అయితే కేఎల్ రాహుల్ తో పాటు అతని ప్రేయసి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా వ్యవహరించాడు కేఎల్ రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: