సాధారణంగా భారత జట్టులో ఇక ఇండియాకు చెందిన ఆటగాళ్లు మాత్రమే ఉండడం చూస్తూ ఉంటాం. కానీ ఇతర జట్లలో మాత్రం భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లి అక్కడ సెటిల్ అయిన వారు ఇక ఆయా దేశాలలో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుంటూ ఇక మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న నెదర్లాండ్స్ జట్టులో తేజ అనే విజయవాడ కుర్రాడు ఉన్నాడు అన్న విషయం తెలిసి ఇక తెలుగు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు.



 అయితే బీసీసీఐ కఠిన నిబంధనల కారణంగా కేవలం భారతీయులు మాత్రమే జట్టులో స్థానం సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది.. కానీ ఇతర దేశాలలో మాత్రం ఒక దేశం తరఫున ఆడిన ఆటగాడు కూడా మరో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా రెండు దేశాల తరఫున జాతీయ జట్టులో కొనసాగిన ఆటగాళ్లు విదేశాల్లో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు దీనికి సంబంధించిన చర్చ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. ఇప్పుడు మరో తెలుగు సంతతి ఉన్న క్రికెటర్ వెస్టిండీస్ జట్టులో స్థానం సంపాదించుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇక సదరు ఆటగాడు ఎవరో కాదు వెస్టిండీస్ జట్టు తరఫున ఆడి దిగ్గజ బ్యాట్స్మెన్ గా గుర్తింపు సంపాదించుకున్న శివ నారాయన్ చందర్పాల్ కుమారుడే కావడం గమనార్హం. చందర్పాల్ కుమారుడు టాగే నరైన్ వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడునుండగా ఇక జట్టు యాజమాన్యం నుంచి అతనికి పిలుపు వచ్చింది. ఇక ఈ టెస్ట్ సిరీస్ నవంబర్ 30 తేదీన పెర్త్ లో ప్రారంభం కాబోతుంది. అయితే చందర్పాల్ కుటుంబం భారతదేశానికి చెందిన వారే కావడం గమనార్హం. కానీ ఎన్నో ఏళ్ల కింద వెస్ట్ ఇండీస్ లో సెటిల్ అయ్యారు. ఇకపోతే ఇప్పుడు వరకు టాగే నరైన్ 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు 2669 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: