సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలెబ్రిటీల దగ్గర నుంచి క్రీడాకారుల వరకు ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రికెటర్లు అయితే తమ జెర్సీ నెంబర్ విషయంలో ఎంతో సెంటిమెంట్ పెట్టుకుంటూ ఉంటారు. అందుకే క్రికెటర్లకు సంబంధించిన జెర్సీ నెంబర్లు ఎప్పుడు ఇక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. మహేంద్ర సింగ్ ధోని 7 నెంబర్ జెర్సీ తోనే మొదటి నుంచి క్రికెట్లో కొనసాగుతూ అదరగొట్టాడు. ఇక జెర్సీ నెంబర్ సెవెన్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా హవా నడిపించాడు.


 అయితే విరాట్ కోహ్లీ సైతం అటు జర్సీ నెంబర్ 18 ధరిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆటగాళ్లు ధరించే జెర్సీ నెంబర్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి అన్నది తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి   అయితే విరాట్ కోహ్లీ 18 నెంబర్ జెర్సీ ధరించడానికి గల కారణం ఏంటి అని అడిగితే అభిమానులు ఒక చిన్న స్టోరీ చెబుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ ఆగస్టు 18వ తేదీన టీమ్ ఇండియాలోకి వచ్చాడు. అంతేకాకుండా కోహ్లీకి ప్రాణమైన అతని తండ్రి ఇక 18వ తేదీన దురదృష్టవశాత్తు మరణించారు.


 అందుకే విరాట్ కోహ్లీ 18 నెంబర్ జెర్సీని ధరిస్తూ ఉంటాడు అని అభిమానులు అందరూ చెబుతూ ఉంటాడు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వచ్చాయ్. ఈ విషయంపై కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను నా జెర్సీ నెంబర్ 18 కావాలి అని ఎప్పుడు కూడా అడగలేదు. నా మొదటి అండర్ 19 జెర్సీని పొందినప్పుడు 18వ నెంబరు ఉంది. అంతేకాకుండా నేను ఆగస్టు 18న భారత్ టీంలోకి అరంగేట్రం చేశాను. దురదృష్టవశాత్తు మా నాన్న 18వ తేదీన మరణించారు. కాబట్టి ఇది ఇకపై యాదృచ్ఛికం  కాదు నాతోనే కొనసాగుతుంది అని అనుకున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: