సాధారణంగా ఐపీఎల్లో ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఐపీఎల్లో పాల్గొనడం ద్వారా అటు కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించడంతో పాటు ఇక పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇక ఎన్ని దేశాల నుంచి విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ ఐపీఎల్లో అటు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లది మాత్రం ఎంతో ప్రత్యేకమైన పాత్ర. ఇక ప్రతి సీజన్లో కూడా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు తమ విధ్వంసకరమైన ఆట తీరుతో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. అంతేకాదు ప్రేక్షకుల దృష్టిని తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగే వేలంలో కూడా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లను కొనుగోలు చేసేందుకే అటు అన్ని ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటాయి.


 అయితే ఇప్పటికే 2023 ఐపీఎల్ సీజన్లో కొన్ని జట్ల తరఫున సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు కొనసాగుతున్నారు. కానీ ఇక ఇప్పటివరకు ఒక్కరు కూడా ఐపీఎల్ లో పాల్గొనలేకపోయారు అని చెప్పాలి. దీనికి కారణం సౌత్ఆఫ్రికా ప్రస్తుతం నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడుతూ ఉండడమే. ఇక తమ దేశం తరఫున ఆడటానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన సౌతాఫ్రికా ప్లేయర్లు నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఆడారు. ఇక ఇటీవల వన్డే సిరీస్ ముగియడంతో ఇక ఇప్పుడు సఫారీ ప్లేయర్లు అందరూ కూడా ఇండియాలో వాలిపోయారు అన్నది తెలుస్తుంది. ఇక తదుపరి మ్యాచ్లకు తమ తమ జట్లకు అందుబాటులోకి ఉండనున్నారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు.


 ఇలా ఐపిఎల్ లో చేరిన ఆటగాళ్లలో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న మార్కరమ్ తో పాటు జాన్సన్, క్లాస్సేన్ కూడా కలిశారు. ఇక గుజరాత్ టీంలో మిల్లర్, పంజాబ్ టీం లో రబాడ,  లక్నో టీంలో డికాక్, చెన్నై టీం లో సిసింద్ర, ఢిల్లీ టీం లో ఎంగిడి, నోర్జె చేరారు అని చెప్పాలి. అయితే ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు అందరూ కూడా ప్రస్తుతం ఐపీఎల్ లో చేరిన నేపథ్యంలో ఇక ఐపీఎల్ పోరు మరింత రసవతరంగా మారబోతుంది అని అటు అభిమానులు బలంగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భువనేశ్వర్ కెప్టెన్సీ లో బరిలోకి దిగి మొదటి మ్యాచ్లో ఓడిపోయింది.. ఇక మార్కరమ్ వచ్చిన తర్వాత ఎలా రాణించబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl