
ఈ వేడుకలో గీతా ఆర్ట్స్ బాస్ అల్లు అరవింద్ సమక్షంలోనే నిర్మాత బన్నీ వాస్, విజయ్‌తో మరోసారి సినిమా చేయబోతున్నట్లు పబ్లిక్‌గా ప్రకటించాడు. "గీత గోవిందంలా చెప్పుకునే సినిమా మళ్లీ తీస్తాం.. ఈసారి ఇంకా బలంగా హిట్టు కొడతాం" అని ఆయన స్పష్టం చేయడంతో అభిమానుల్లో భారీ హైప్ మొదలైంది. బన్నీ వాస్ అన్నాడంటే అది జరిగి తీరుతుందని టాలీవుడ్ సర్కిల్‌లో నమ్మకం. ఇప్పటికే గీతా ఆర్ట్స్, విజయ్ కోసం పలు కథలు వింటోందట. కథ సెట్ అయితే వెంటనే సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదట్లో గీత గోవిందం టీమ్‌నే మళ్లీ రిపీట్ చేద్దామని అనుకున్నారు. అంటే పరశురామ్ – విజయ్ కాంబినేషన్ మళ్లీ రాబోతుందని అంచనాలు. కానీ ఫ్యామిలీ స్టార్ రూపంలో ఇప్పటికే ఆ కాంబో ఒక ఫ్లాప్ ఇవ్వడంతో, ఇప్పుడు కొత్త డైరెక్టర్ – కొత్త కథ వైపు దృష్టి సారించింది గీతా ఆర్ట్స్.
ఈసారి విజయ్ ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేలా, మాస్ – ఫ్యామిలీ టచ్ ఉన్న కథను లాక్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం మాస్ ఆడియన్స్‌లో మరింత బలమైన ఇమేజ్ కావాలి. అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి సినిమాల కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చే ప్రాజెక్ట్ ఆ లోటును భర్తీ చేస్తే, విజయ్ కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి రావడం ఖాయం. అంతేకాదు, అల్లు అరవింద్ మద్దతుతో వచ్చే ప్రాజెక్ట్ అన్నది ఎప్పుడూ ప్రత్యేకమే. టాలీవుడ్ ట్రెండ్‌ను సెట్ చేసేలా సినిమాలను ప్లాన్ చేసే గీతా ఆర్ట్స్, ఈసారి విజయ్‌తో మరో గోల్డెన్ హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి త్వరలోనే విజయ్ – గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావచ్చు. అప్పటి వరకు అభిమానులు గీత గోవిందం 2.0 కోసం వెయిట్ చేయాల్సిందే!