
విడుదల అయిన ఆరవ రోజు మీడియం రేంజ్ మూవీలలో హనుమాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.57 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , ప్రతి రోజు పండగే సినిమా 2.80 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. గీత గోవిందం సినిమా 2.61 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , బేబీ మూవీ 2.45 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. అఆ సినిమా 2.21 కోట్ల కలెక్షన్లతో ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ఎం సీ ఏ సినిమా 2.30 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , జాతి రత్నాలు సినిమా 2.05 కోట్లకు కలెక్షన్లతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక మీరాయ్ సినిమా 1.95 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది. ఇలా మిరాయ్ సినిమా విడుదల అయిన ఆరవ రోజు మీడియం రేంజ్ మూవీలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో 8 వ స్థానంలో కొనసాగుతుంది.