- ( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ ) . . .

- రామచంద్ర యాదవ్ పర్యటనపై 144 సెక్షన్ విధించడం తో రద్దయిన ఉదయగిరి పర్యటన
- రామచంద్ర యాదవ్ కు తమ గోడును చెప్పుకునేందుకు పుంగనూరు కు వచ్చిన బాధితులు
- త్వరలో నే ఉదయగిరికి వస్తానని మాట ఇచ్చిన రామచంద్ర యాదవ్

భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ను పుంగనూరులోని ఆయన నివాసంలో ఉదయగిరి మైనింగ్ బాధితులు కలిశారు. గురువారం మైనింగ్ బాధితులతో రామచంద్రయాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైనింగ్ బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. మైనింగ్ పేరుతో పచ్చని పల్లె ల్లో చిచ్చు పెడుతున్నారని వారు కన్నీటి పర్యంతం అయ్యారు. అక్రమ మైనింగ్ తో మాఫియా రెచ్చిపోతోందని ఆయ‌న తెలిపారు. తమ ప్రాంతం లో పర్యటించి అక్రమ మైనింగ్ ను నిలుపుదల చేసేందుకు సహకరించాలని కోరారు.


అనంతరం రామచంద్ర యాదవ్ బాధితులతో మాట్లాడారు. గత శనివారం ఉదయగిరి నియోజకవర్గంలో ని వరికుంటపాడు మండలం లో మైనింగ్ బాధితులతో సమావేశానికి రావడానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నానని, కానీ పోలీసులు తన పేరు మీద 144 సెక్షన్ విధించారని తెలిపారు. తన వల్ల మైనింగ్ బాధితులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పర్యటన వాయిదా వేసుకున్నానన్నారు. త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని మాట ఇచ్చారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా, బాధితులకు అండగా బిసివై పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: