
రాజధాని అమరావతి కోసం ఆన్ సైడ్ భూములను ఇచ్చిన రైతులకు ఊరట కలిగించేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆన్ సైడ్ భూములను ల్యాండ్ వూలింగ్ లో ఆన్ సైడ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్లను.. ఇకమీదట ఆన్ సైడ్ కాకుండా పట్టా పేరుతోనే జారీ చేయించేలా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రైతులందరికీ పట్టా పేరిట ఆ ఫ్లాట్లు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అవసరమైన మార్పులు కూడా చేసేలా జీవోను జారీ చేశారు. ఈ ప్లాట్లను రైతులు అమ్ముకునే వీలు కలిగించేలా సదుపాయాన్ని కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం.
అలాగే అమరావతి రాజధాని నిర్మాణం పైన ప్రత్యేకించి మరి ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. కేంద్ర మద్దతుతో అమరావతి నిర్మాణ పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అమరావతి కోసం 88 వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో 50 వేల కోట్ల రూపాయల విలువైన పనులను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, సిఆర్డిఏ వంటి వాటితో చేస్తున్నారు . ఇప్పుడు అదనంగా 14,200 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్, ఏడిబీకి దరఖాస్తు చేసుకోగా రుణం పొందేందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.