తెలుగు సని పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉన్నా కూడా వరుస పెట్టి సినిమాలలో నటించకుండా అచి తుచి సినిమాలను ఎంచుకుంటూ వెళుతుంది. కొంత కాలం క్రితం అనుష్క శెట్టి "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

సినిమా కంటే ముందు అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. అలాగే ఈ సినిమా తర్వాత కూడా ఈమె చాలా గ్యాప్ తీసుకొని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమాలో నటించింది. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కొంత కాలం విడుదల ఆయన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపించలేక పోయింది.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్లో ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు, అందులో భాగంగా ఈ సినిమాను అక్టోబర్ రెండవ తేదీ నుండి తమ ఓటీపీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా ఓ టీ టీ ఆయన ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

as