మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇక ఓ వైపు విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే చిరంజీవి మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాకు మన శంకర వర ప్రసాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఇప్పటికే విడుదల చేశారు.

మూవీ లో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇలా ఓ వైపు రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నా చిరు ఇప్పటికే తనకు వాల్టేరు వీరయ్య సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందించిన బాబి కొల్లి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే బాబీ ప్రస్తుతం మెగా 158 మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రీ ప్రొడక్షన్ పనులను మరి కొన్ని రోజుల్లోనే బాబి పూర్తి చేయనున్నట్లు డిసెంబర్ నుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా బాబి ఈ సినిమా పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తుండడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: