
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో విజయ్ ఆంటోని మంచి గుర్తింపును సంపాదించుకునానరు. విజయ్ ఆంటోని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తెలుగులో కూడా విజయ్ ఆంటోని భిన్న ప్రాజెక్ట్ లతో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఈరోజు భద్రకాళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం.
కథ :
సెక్రటేరియట్ లో పవర్ బ్రోకర్ గా పని చేసే కిట్టు (విజయ్ ఆంటోని) తన ప్రతిభతో ప్రభుత్వ అధికారులతో సులువుగా పనులు చేయిస్తూ ఉంటాడు. కేంద్ర మంత్రి 800 కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా కిట్టు జోక్యం చేసుకుంటాడు. అయితే ఈ పని చేసే సమయంలో ఒక ఎమ్మెల్యే హత్యకు గురి కావడం వల్ల ఎమ్మెల్యేకు ఇబ్బందులు ఎదురవుతాయి.
అయితే కిట్టూ ఏకంగా 6200 కోట్ల రూపాయల డబ్బు వెనకేశాడంటూ మంత్రికి తెలుస్తుంది. కిట్టూ నేపథ్యం గురించి కేంద్ర మంత్రికి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అభయంకర్ రాష్ట్రపతి కాకుండా కిట్టూ అడ్డుకోవడానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కిట్టు పాత్ర హైలెట్ గా నిలిచింది. అవినీతిపరులైన రాజకీయ నేతలకు ఏ విధంగా కిట్టూ చుక్కలు చూపించాడని కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రభుత్వ వ్యవస్థలో మీడియేటర్ పాత్ర ఏంటో కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారు. అరుణ్ ప్రభు ఎంచుకున్న కథలో ఎన్నో చిక్కుముడులు ఉన్నా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంది.
కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అభయంకర్ కిట్టూ మధ్య శత్రుత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఈ సినిమాలో విజయ్ ఆంటోని నటన బాగుంది. విజయ్ భార్య పాత్రలో తృప్తి ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్ బాగుండగా సెకండాఫ్ సహనానికి పరీక్ష పెట్టింది.
బలాలు : విజయ్ ఆంటోని నటన, ఫస్టాఫ్, మ్యూజిక్
బలహీనతలు : సెకండాఫ్, స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2.5/5.0