కల్కి 2898 ఏడీ సినిమా విడుదలైనప్పటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో హైప్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రభాస్, అమితాభ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోణె వంటి స్టార్ కాస్టింగ్ తో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద హవా చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సీక్వెల్ లో హీరోయిన్ దీపికా పదుకోణె లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీపికా ఎగ్జిట్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆమెను తప్పించడం సరైన నిర్ణయం అంటూ చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. కారణాలు కూడా వివిధ రకాలుగా వస్తున్నాయి. పారితోషికం, షూటింగ్ డేస్, పని గంటల విషయాల్లో సర్దుబాటు కానందువల్లే దీపికాను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించారు. తన సోషల్ మీడియా ఖాతాలో కల్కి 2898 ఏడీ సినిమాలోని కృష్ణుడి ఎంట్రీ సీన్‌ను షేర్ చేశారు. అందులో కృష్ణుడు అశ్వత్థామకు చెప్పే డైలాగ్ – “కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే..” అనే లైన్ తో పాటు నాగ్ అశ్విన్ క్యాప్షన్ గా “జరిగిపోయిన దానిని మార్చలేం.. కానీ తర్వాత ఏం జరగాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది” అని రాశారు. ఈ పోస్టు వెనుక దీపికా పదుకోణె ఎగ్జిట్ ఉన్నదన్న అభిప్రాయం నెటిజన్లలో బలంగా వ్యక్తమవుతోంది. నాగ్ అశ్విన్ పరోక్షంగా ఆమెకు సమాధానం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. “జరిగిపోయిన దానిని మార్చలేం” అనే లైన్ తో దీపికా వెళ్లిపోవడాన్ని అంగీకరించేసి, “తర్వాత ఏమి జరగాలనేది మన చేతుల్లో ఉంది” అనే లైన్ తో కొత్త హీరోయిన్ ఎంట్రీని సూచిస్తున్నారని టాక్.

ఇక సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ మరోసారి మాస్ యాక్షన్ తో రాబోతున్నాడు. అమితాభ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ యమధర్మరాజు లాంటి శక్తివంతమైన రోల్ లో కనిపించబోతున్నాడు. అయితే దీపికా బదులు ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారు? అనేది సస్పెన్స్ గా మిగిలిపోయింది. బాలీవుడ్ నుంచి టాప్ హీరోయిన్ ని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా, నాగ్ అశ్విన్ చేసిన ఈ పోస్ట్ తో సోషల్ మీడియాలో మళ్లీ కొత్త చర్చలు రేగాయి. కల్కి 2898 ఏడీ సీక్వెల్ గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో హంగామా క్రియేట్ చేస్తోంది. దీపికా లేకపోవడమే సీక్వెల్ కి షాక్ అయినా, కొత్త హీరోయిన్ ఎంట్రీతో మళ్లీ సంచలనమే రాబోతోందని అభిమానులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: