
గత జగన్ ప్రభుత్వం కాలంలో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా ప్రజలకు పరిచయమైన ఈ పథకం పేరుని, కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో ఇంకా పాత పేరునే పలుకుతున్నారని విమర్శలు రావడంతో, దీనిపై సత్య కుమార్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.."ఆయన గట్టిగా “ఆరోగ్యశ్రీ అనేది ఇకపై లేదు. పేరు మారింది. ఇప్పుడు అది ఎన్టీఆర్ వైద్య సేవ” అని చెప్పారు. అంతేకాదు, పథకం ఆగిపోయిందని, నిలిచిపోయిందని కొందరు చెబుతున్నారనడానికి పూర్తిగా కౌంటర్ ఇస్తూ, వాస్తవాలు బయట పెట్టారు."
“గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజా ధనం దుర్వినియోగం చేశాయి. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా 457 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లించాం. ఇప్పటివరకు 13 లక్షల 42 వేల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా నేరుగా ప్రయోజనం పొందారు. కాబట్టి ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడం తప్పు, పేరు మాత్రమే మారింది” అని స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలలో కొందరు సైలెంట్ అయ్యారు. ఆయన మాట్లాడిన ధైర్యం, ఇచ్చిన కౌంటర్ లెవెల్ వేరే స్థాయిలో ఉందని అక్కడ ఉన్నవాళ్లు భావించారు.
సోషల్ మీడియాలో కూడా ఈ స్టేట్‌మెంట్ పెద్ద చర్చనీయాంశమైంది. కొందరు నెటిజన్లు “ఇది బాంబ్ షెల్ స్టేట్‌మెంట్.. వైసిపి నాయకులకు ఇది ఘాటు సమాధానం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దీన్ని కొత్త కూటమి ప్రభుత్వ విజయంగా అభివర్ణిస్తున్నారు.మొత్తానికి, మంత్రి సత్య కుమార్ అసెంబ్లీలో చేసిన ప్రకటన, ఒక చిన్న క్లారిఫికేషన్ కంటే ఎక్కువగా మారి పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఆయన మాటలు కేవలం అసెంబ్లీలోనే కాకుండా, ప్రజల మధ్య కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఇకపై రాష్ట్ర ప్రజలకు వైద్య సేవల పరంగా “డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ” అనే పేరే బ్రాండింగ్ అవుతుందని స్పష్టమైంది.