ఏంటి టాలీవుడ్ లో మరో విడాకులు జరగబోతున్నాయా..ఆ జంట విడిపోబోతున్నారా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి అని చాలామంది ఈ విషయంలో ఆలోచనలో పడతారు. అయితే గొడవలు పడుతున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీ జంట ఎవరయ్యా అంటే శర్వానంద్ జంట అని టాక్.. ఏంటి శర్వానంద్ తన భార్యతో గొడవలు పెట్టుకుంటున్నారా.. నిజంగానే ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా? ఎందుకు వీరిపై ఇలాంటి రూమర్లు వస్తున్నాయి అని ఈ హీరో పేరు బయటపడటంతోనే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తారు. అయితే సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం శర్వానంద్ ఆయన భార్య మధ్య సఖ్యత లేనట్టు తెలుస్తోంది. శర్వానంద్ రక్షిత రెడ్డి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్దిరోజులకే వీరి మధ్య గొడవలు వచ్చినట్టు సమాచారం. 

అయితే రీసెంట్ గా రక్షిత రెడ్డి కి పాప పుట్టిన సంగతి మనకు తెలిసిందే. పాప పుట్టినప్పటి నుండి ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చి గొడవలు పడి రక్షిత రెడ్డి తన పుట్టింట్లోనే ఉంటున్నట్టు సమాచారం.అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు త్వరలోనే శర్వానంద్ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అయితే శర్వానంద్ కి విడాకులు తీసుకునే ఆలోచన అయితే లేనట్టు సమాచారం. ఇక ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. శర్వానంద్ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదట. కానీ కొద్దిరోజులు వేరు కాపురం పెట్టాలని చూస్తున్నారట. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగితే ఆ దూరం దగ్గరయ్యేలా చేస్తుంది అని ఇరుకుటుంబ పెద్దలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

 అలా పరస్పర అంగీకారంతో కొద్దిరోజులు ఈ జంట వేరు కాపురం పెట్టాలని చూస్తున్నారట. అయితే ఇరువైపులా ఉన్న పెద్దలు కలిసిపోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇద్దరి మధ్య పంతం వీడడం లేదని,అందుకే వీరి మధ్య గొడవ చల్లారే వరకు కొద్దిరోజులు వేరుగా ఉండమని విడాకులు తీసుకునే ఆలోచనని వదిలేయమని పెద్దలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రక్షిత రెడ్డి తన పాపతో పుట్టింట్లో ఉండగా.. శర్వానంద్ తన పేరెంట్స్ తో కలిసి ఉంటున్నారు.ఇక పాప అప్పుడప్పుడు శర్వానంద్ ఇంటికి కూడా వచ్చి వెళ్తుందట. అయితే ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమరేనా లేక వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: