2023 ఐపీఎల్ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగింది. నువ్వా నేనా అంటూ జరిగిన పోరులో చివరికి అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి ఒక విషయంపై మాత్రం తీవ్రమైన చర్చ కొనసాగింది. అదే ధోని ఐపిఎల్ రిటైర్మెంట్ గురించి. అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ గురుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ అంటూ వార్తలు జోరుందుకున్నాయ్.  దీంతో అభిమానులు అందరూ కూడా చెన్నై అభిమానులు సీఎస్కే ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా అక్కడికి భారీగా తరలి వెళ్లారు. అయితే 2023 ఐపిఎల్ సీజన్లో చెపాక్ స్టేడియంలో కోల్కతా నైట్రేటర్ తో మ్యాచ్ అనంతరం ఏకంగా మహేంద్ర సింగ్ ధోని స్టేడియం మొత్తం తిరుగుతూ అభిమానులందరికీ కూడా అభివాదం చేశాడు. అంతేకాదు ఇక తన జెర్సీలను స్టేడియంలోకి విసిరాడు. దీంతో ఇక మహేంద్రసింగ్ ధోని కి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే మహేంద్ర సింగ్ ధోని ఇలా మైదానం మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో లెజెండరీ ప్లేయర్ గా కొనసాగుతున్న సునీల్ గావాస్కర్ ఆ సమయంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.


 అయితే ధోని ఇలా మైదానం మొత్తం తిరుగుతుండగా.. ధోని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన గవాస్కర్ ఏకంగా తన షర్టుపై ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఇక ఈ మూమెంట్ అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎవర్గ్రీన్ మూమెంట్గా నిలిచిపోయింది. అయితే ఇదే విషయం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమిజ్ రాజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లెజెండ్ సునీల్ గవాస్కర్ వచ్చి ఆటోగ్రాఫ్ కోరిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పుకొచ్చాడు. ధోనికి ఈ ఐపీఎల్ సీజన్ ఎప్పటికి గుర్తుండిపోతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇంతకన్నా పెద్ద ప్రశంస ధోనీకి లేదని తెలిపాడు పాక్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్.

మరింత సమాచారం తెలుసుకోండి: