ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద రావు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాపాక జ‌న‌సేన త‌ర‌పున ఏక్ నిరంజ‌న్ అన్న‌ట్టుగా సింగిల్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి వైసీపీకి ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు మొన్న రాజ్య‌స‌భ ఎన్నికల్లో రాపాక ఓటు సైతం వైసీపీకే వేశారు. ఇక బ‌య‌టా.. లోప‌ల కూడా రాపాక జ‌గ‌న్‌ను పొగుడుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

రాపాక విష‌యంలో కొద్ది రోజుల పాటు ఫైర్ అయిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్  ఆ త‌ర్వాత రాపాక‌ను ప‌ట్టించు కోవ‌డం మానేశారు. పార్టీ కార్య‌క్రమాల‌కు కూడా పిల‌వ‌డం మానేశారు. స్థానికంగా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రాపాక ను పూర్తిగా వ‌దిలేశారు. ఇక రాపాక ఇప్పుడు జిల్లాలో వైసీపీ మంత్రులు,  వైసీపీ ఎమ్మెల్యేల‌తోనే తిరుగుతున్నారు. రాజోలులో రాపాక ఏం ప‌నులు చెప్పినా చేయాల‌ని ఇప్ప‌టికే వైసీపీ అధిష్టానం తో పాటు సీఎం జ‌గ‌న్ నుం చి ఆదేశాలు కూడా వెళ్లాయ‌ట‌. దీంతో రాపాక పూర్తిగా వైసీపీ కంట్రోల్లోకి వెళ్లిపోయారు.

 

రాపాక ప‌వ‌న్‌కు ఎప్పుడు అయితే దూరం అయ్యాడో అప్ప‌టి నుంచి జ‌న‌సేన వాళ్లు ఆయ‌న్ను ఆడుకుంటున్నారు. రాపాక గ‌తంలో చేసిన ఓ కామెంట్‌ను హైలెట్ చేస్తూ సోష‌లో మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పార్టీకి ఒకే ఎమ్మెల్యే ఉన్నాకూడా ఛాంబర్,అసెంబ్లీలో ముందువరుస సీటు కేటాయించాలి అని వైసిపిని అడిగితే నాకు ఇవ్వలేదు. ఆనాడు వైసీపీలో ఒకే ఎమ్మెల్యే విజయమ్మకు ఎలా ఇచ్చారు ? నా కులం ఎస్సీ కాబట్టి ఇవ్వట్లేదా ? ఈ విషయాన్నీ అసెంబ్లీలో అడుగుతాను అని ప్ర‌శ్నించిన ప్ర‌శ్న‌ను ఇప్పుడు హైలెట్ చేస్తూ బాబూ రాపాక అసెంబ్లీలో ఛాంబర్ కోసం జంపింగ్ జపాక్ వి అయ్యావా.. ఓ చిన్న గ‌ది కోస‌మే పార్టీ మారావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: