చంద్రబాబు గారాలపట్టి లోకేష్ రాజకీయ జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక  అష్టకష్టాలు పడాల్సి వస్తుందో అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతలు తప్పనిసరిగా లోకేష్ తీసుకుంటాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు. అప్పుడప్పుడు బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ వంటి వారి పేర్లు ప్రస్తావనకు వచ్చినా, వారెవరికీ ఆ అవకాశం ఇచ్చేందుకు బాబు ఏ మాత్రం అవకాశం ఎవరు అలా ఇస్తే, ఆ తరువాత లోకేష్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చంద్రబాబుకు తెలియంది కాదు  అందుకే లోకేష్ కు పోటీ రాకుండా బాలయ్య, నందమూరి సుహాసిని వంటి వారికి పార్టీలో కీలక పదవులు అప్పగించి కాస్త కూల్ చేశారు. కానీ లోకేష్ పెర్ఫార్మెన్స్ చంద్రబాబుకు ఇప్పుడు డౌట్ తో కూడిన అనుమానం బయలుదేరింది. లోకేష్ పార్టీని నడిపించే శక్తి సామర్ధ్యాలు సంపాదిస్తారా లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న ను నియమించడం, ఆయన దూకుడు స్వభావంతో పార్టీ నేతల్లో నమ్మకం పెంచుకో కపోవడం, వంటివి ముందు ముందు లోకేష్ కు మంట పుట్టించే అంశాలు. ఎందుకంటే తన కంటే అచ్చెన్న పైచేయి సాధిస్తే, పార్టీ శ్రేణులు లెక్కచేయరు అనేది లోకేష్ అభిప్రాయం. తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. 



పార్టీ కమిటీల నియామకంలో లోకేష్ అనుకూలమైన వారిని నియమించడం వంటి వ్యవహారాలు చూసినా, బాబు చాలా లెక్కలు వేసుకునే మరి ఈ నియమకాలు చేపట్టినట్టు గా కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు లోకేష్ గురించి చెప్పుకుంటే, ఆయన జనం లోకి వెళ్ళి, పార్టీ నేతలను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నించినా, ఫలితం మాత్రం కనిపించే లేకపోవడంతో, బాబు కొత్త దడ మొదలైంది. ఏదోరకంగా లోకేష్ బలమైన, సమర్ధుడైన నాయకుడు గా తీర్చి దిద్దాలని, అది ఎలా చేయాలి అనేది ఆయనకు అంతు పట్టడం లేదు. ప్రస్తుతం లోకేష్ బాబు జిల్లాల పర్యటనలతో హడావుడి చేస్తూ, పార్టీ నేతల్లో ధైర్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, లోకేష్ టిడిపి ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు ఆయనకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. 

మెజారిటీ నాయకుల్లో బలం లేకపోవడం, టిడిపి సైకిల్ ను లోకేష్ తొక్క లేరు అనే అభిప్రాయం ఏర్పడడం, ఇలా ఎన్నో కారణాలు ఇబ్బందికరంగా మారాయి. ఈ మధ్యనే టిడిపి ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు 2024 చంద్రబాబు సీఎం చేయడమే తమ లక్ష్యమంటూ ప్రకటించడం, లోకేష్ పేరు ప్రస్తావించకపోవడం, ఇలా చాలా కారణాలే లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.అయ్యే పాపం చినబాబు కి ఎన్ని కష్టలో కదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: