తమ శాడిజం తో జనాలను రకరకాలుగా హింసిస్తూ , మానసిక ఆనందం పొందడం కొంతమందికి అలవాటు. వారి వల్ల వారి బంధువులు, స్నేహితులు మరి కొంత మంది ఇబ్బంది పడవచ్చు. అదే ఒక దేశ అధ్యక్షుడికి ఆ శాడిజం ఉంటే, ప్రజలను ఎన్నో రకాలుగా హింసిస్తారు. ఆ శాడిజం ఉంటే, ఆ దేశ ప్రజల పరిస్థితి దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టుగా మారిపోతుంది. అధ్యక్షుడు శాడిజం తో బ్రతకలేక చావలేక అన్నట్టుగా నిత్యం ఆ దేశ ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి దుస్థితి ఉత్తరకొరియా ప్రజలకు అధ్యక్షుడు రూపంలో దాపురించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కిమ్ జాంగ్ ఉన్ తుగ్లక్ చర్యలు తీసుకుంటూ, ఆ దేశ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నారు. కిమ్ నిర్ణయం ఏది తీసుకున్నా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఎవరు ఏం చెప్పినా వినే రకం అయితే కాదు. నేను చెప్పిందే అంతా వినాలని చూస్తుంటారు.



తాజాగా కరోనా ను అదుపు చేసేందుకు లాక్ డౌన్ ను ఉత్తరకొరియా లో విధించారు. అయితే దాన్ని ఉల్లంఘించిన ఇద్దరు అధికారులను ఉరితీయడం సంచలనంగా మారింది. దక్షిణ కొరియాకు చెందిన ఓ సీక్రెట్ ఏజెన్సీ దీనికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఉత్తర కొరియా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కానీ ఈ విషయాలు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా, తమ దేశంలో ఒక్క కేసు కూడా లేదని ఉత్తరకొరియా బయట దేశాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు తమ దేశంలో కరోనా ను అదుపు చేసేందుకు ఉత్తర కొరియా దొంగ మార్గాలను వెతుకుతోంది. దక్షిణ కొరియాకు చెందిన ఫార్మా కంపెనీల డేటా ను హైజాక్ చేసి, ఉత్తర కొరియా లో వ్యాక్సిన్ తయారు చేయాలని కిమ్ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.




తాజాగా ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యంగ్తో పాటు, జంగ్యంగ్ల ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆ నిబంధన  ఉల్లంఘించిన వారికి మరణశిక్ష విధించారు. ఓ అధికారి విదేశాల నుంచి రహస్య సరుకులు తెచ్చుకున్నాడనే విషయం తెలియడంతో ఆ అధికారితో పాటు, మరో అధికారిని ఉరి తీయించినట్టు సమాచారం. దీంతో ఉత్తర కొరియా పై ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదేం శాడిజం రా బాబు అంటూ కిమ్ తీరుపై ఆ  దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: