
నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలైపోతుందని చంద్రబాబునాయుడుకు మునిశాపం ఉందని సోషల్ మీడియాలో ఓ రేంజిలో సెటైర్లు పడుతుంటాయి. తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే ‘తానేం పాపం చేశానో తనకు అర్ధం కావటం లేదట.’ ‘అభివృద్ధి చేయటమే తాను చేసినా పాపమా..అందుకేనా తనను జనాలు శిక్షించింది’ అని పాపం సెంటిమెంటునంతా ఒలకబోశారు. సంక్రాంతి పండుగ నాడైనా కాస్త నిజాలు మాట్లాడుతారేమో అని ఆశించిన జనాలకు పండుగపూట కూడా తీవ్ర నిరాసే ఎదురైంది. చంద్రబాబు మాటలు విన్న తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
చంద్రబాబు తాజా వ్యాఖ్యలనే తీసుకుందాం. 2014లో అధికారంలోకి వచ్చిందో తప్పుడు హామీలిచ్చి. రైతు రుణమాపీ చేస్తానని, కాపులను బీసీల్లో చేరుస్తానని, డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని, అన్నక్యాంటిన్లను ఏర్పాటు చేస్తానని ఇలా.. చాలా చాలా హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కహామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీని ఎగొట్టారు. కాపులను బీసీల్లో చేర్చటంలో ఫెయిలయ్యారు. నిరుధ్యోగ భృతిని ఎన్నికలు మరో ఆరుమాసాలుండగా మాత్రమే మొదలుపెట్టారు. అన్న క్యాంటిన్లను కూడా కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే హడావుడిగా మొదలుపెట్టారు.
ఇవి పక్కనపెట్టేస్తే ఆకాశమంత పెరిగిపోయిన అవినీతి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయిన తమ్ముళ్ళు, పెరిగిపోయిన అరాచకాలు ఇలా..చెప్పుకుంటు పోతే అన్నీ విషయాలను చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందుకనే జనాలు విసిగిపోయి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గూబగుయ్యిమనిపించింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా 23 సీట్లిచ్చి మూల కూర్చోబెట్టారు. దీన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నది వాస్తవం. అందుకనే ఎన్నికలై ఏడాదిన్నరయినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేకపోతున్నారు. చంద్రబాబు ఆలోచన ఎలాగుందంటే బతికున్నంత కాలం తానే ముఖ్యమంత్రిగా ఉండాలని. తన తర్వాత తన కొడుకు లోకేష్, ఆ తర్వాత దేవాన్ష్ మాత్రమే సీఎంలుగా ఉండాలని. అయితే ఇది ప్రజాస్వామ్యమని, జనాలే నిజమైన ప్రభువులని మరచిపోతున్నారు. జనాలకు నచ్చకపోతే ఎవరినైనా అధికారంలో నుండి దింపేస్తారని గుర్తుపెట్టుకుంటే చంద్రబాబుకు చాలా మంచిది.