ఆంధ్రప్రదేశ్ లో చిత్రూరు జిల్లాలోని సూరుటపల్లి శివాలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివుడును విగ్రహ రూపంలో పూజించడం ప్రత్యేకతను చాటుకుంది.పచ్చని పరిసరాల మధ్య ఉన్న ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది. సుందరమైన రూపంతో ఆ మహా శివుడు భక్తులకు ఈ ఆలయంలో దర్శనమిస్తు అలరిస్తున్నాడు.