తపస్సు అంటే ‘తపన’. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే ‘తపస్సు. అలా తపించడం వల్ల కచ్చితంగా ప్రయోజనం వుంటుంది. ఎందుకంటే.. మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము ఈ సృష్టిలో దేనికి లేదు.ఇందుకు ఉదాహరణగా.. ఓ ఆయుధాన్ని చాలాకాలం వాడకుండా ఓ మూల పడేస్తే, అది తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. కానీ దాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి.. దాని పనితనాన్ని చూపిస్తుంది.