మన దేశంలో ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరుపుకోవాలన్న పువ్వులు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా హిందు దేవుళ్లను ఆరాధించే ప్రతి ఒక్కరూ పువ్వులను కచ్చితంగా వినియోగిస్తారు. పూజల సమయంలో దేవుళ్లకు పువ్వులను సమర్పించడం.. ఏదైనా పూజతో సంబంధం ఉన్న అతి ముఖ్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.