పెళ్లి అంటే ఆడవారైనా.. మగవారైనా ఇద్దరి జీవితంలో అది ఒక పెద్ద పండుగలాంటిదని చెప్పొచ్చు. చాలా మంది తమ వివాహం గురించి ఎన్నో కలల్ని కంటారు. కొంతమందైతే చిన్నప్పుడే బొమ్మల పెళ్లి చేసే సమయంలో, భవిష్యత్తులో తమకు కాబోయే పెళ్లిలో తమకు కావాల్సిన భాగస్వామి ఎలా ఉండాలో ఊహించుకుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది పెళ్లిళ్లు ఎంత వేగంగా చేసుకుంటున్నారో.. అంతే వేగంగా విడిపోతున్నారు.. దీనికి ప్రధాన కారణం తగాదాలు.