మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతో మంది ఆలయాలకు వెళ్తుంటారు. ఇలా గుళ్లకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా చేసేది కొబ్బరి కాయ కొట్టడం. దేవుడికి ధన కనక వస్తువులనో లేదా వారి వారి తాహతుకు తగినట్లు ఎంతో కొంత సొమ్ము సమర్పించవచ్చు కదా.. కొబ్బరికాయే ఎందుకు కొడతారు అనే సందేహం అందరికీ కలుగుతుంది.