కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది....గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు.... గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. ...శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది.