హిందూ సంస్కృతి యొక్క గొప్ప తనాన్ని పూర్వం ఉపనిషత్తులలో తగు విధంగా వివరించబడినవి. ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్నిపెంచడానికి దోహదం చేస్తాయి.