తీర్దం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి. గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువున్నిసాలగ్రామ శిలలకు రుద్ర నమకచమకాలతో, పురుష సూక్తం, పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి ఇస్తారు.