సమస్త సృష్టిని పరిపాలించే అజ్ఞాతశక్తినే దైవంగా ఆరాధిస్తారు. అనాది నుండి ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు... దైవానికిచ్చిన నిర్వచనం విభిన్నంగా ఉంది. “మునులకు హృదయంలో, స్వల్ప బుద్ధులకు విగ్రహాలలో, బ్రహ్మవేత్తలకు జగమంతా అంతర్యామి గోచరిస్తాడని” సూక్తి రత్నకోశము బోధించినట్టే ‘ఇందు గలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండంటూ’ ...స్తంభంలో నారసింహుని ప్రత్యక్షం గావించిన ప్రహ్లాదుడి ఘనతను భాగవతం తెలిపింది.