పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని సకల ప్రాణ కోటి మనుగడుకు ఉపకరించే కాంతిని అందిస్తోంది. దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే.. నీలం, పసుపు, ఎరుపు, రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వా, రజో, స్తమ గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతిదేవిగా పురాణాలు చెబుతున్నాయి.