కార్తీక మాసం అంటేనే శివ పార్వతులకు ప్రీతి కరమైన మాసం. ఈ నెలలో పరమశివుని భక్తులంతా ఎంతో నియమ నిష్ఠలతో స్వామిని కొలుస్తారు. తమ కోరికలను ఆయనతో చెప్పుకుంటారు. ఈ మాసంలో ఒక్కొరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో కొంతమంది శివ మాల ధరించి భక్తి శ్రద్దలతో ఆయననే ఆరాధిస్తూ ఉంటారు. ఈ నెల రోజుల పాటు శివుని దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోతాయి. శివును పూజ చేయడానికి ఎన్నో మంత్రాలు మరియు పూజ విధానాలు ఉన్న వేటిల్లవే ప్రత్యేకం.