పూర్వం దేవుని కాలంలో దేవుళ్ళు మరియు రాక్షసులు అమరత్వం కోసం చేసే సాగర మథనంలో లక్ష్మి దేవికి చెల్లెలిగా తులసి వచ్చిందని చెబుతుంటారు. అప్పుడు సహోదరి అయినటువంటి తులసి కూడా విష్ణు మూర్తిని చూసి ఇష్ట పడింది. తనను పెళ్లి చేసుకోవాలని కళలు కూడా కన్నది, కానీ అప్పటికే లక్ష్మీదేవి తో వివాహం జరిగి ఉండడంతో, తన అక్కపై ఎంతో కోపాన్ని ప్రదర్శించిందని పురాణాల ద్వారా తెలిసింది. దీనితో తీవ్ర ఆవేశానికి గురయిన లక్ష్మి దేవి తులసి మీద కోపంతో ఆమెని శపించింది.