సిక్కు మతస్థులకు గురునానక్ జయంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఇది వారి మొదటి మత గురువైన గురునానక్ గారి పుట్టిన రోజుకు ప్రతీకగా పండుగ లాగా జరుపుకుంటారు. ఈ పండుగను ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ 30వ తేదీన గురునానక్ జయంతిని జరుపుకుంటారు.