హిందువులకు మాములుగా వచ్చే అన్ని పౌర్ణిమలలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పూర్ణమి అంటే మహా ప్రీతి. కార్తీక మాసంలో శివుని భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు. ఇది హరి హరులకు అత్యంత ముఖ్యమైనది. మనకున్న అన్ని తెలుగు మాసాలలో ఈ కార్తీక మాసానికి చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయని వేదాలు మరియు పురాణాలు చెబుతున్నాయి. అటు 'శివునికి , ఇటు విష్ణువుకు ఇరువురికీ ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి, ఈ మాసంలో మానవులంతా వారిద్దరినీ భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారికి ఎంతో శుభం కలుగుతుందని పురాణాలలో చెప్పబడి ఉన్నది. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.