హిందువులు ఎక్కువగా దైవ భక్తి కలిగి ఉంటారు. ప్రతి రోజూ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే పూజ చేసే సమయంలో దీపారాధన చేయడం ఎంత ముఖ్యమో... దేవునికి సమర్పించడం అంతే ముఖ్యం. వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక పండుగ రోజు అయితే ప్రత్యేక వంటకాలను వండి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. కొందరు దేవుళ్లకు ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి.