సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఇంట్లో ఎటువంటి శుభకార్యం చేయాలన్నా...లేదా గుడికి వెళ్లాలన్నా కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. కనీసం అది చిన్న కార్యమైనా కొబ్బరికాయ కొట్టందే జరపరు. కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైంది కాబట్టే శుభకార్యం సరిగ్గా జరగాలని కొబ్బరి కాయ కొడతారు. ఇది ఇంత పవిత్రమైనది కాబట్టే దేవునికి ఎంతో భక్తితో సమర్పిస్తారు.