హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు వచ్చిన అన్ని అవతారాల్లో దత్తావతారం కూడా ఒక అవతారమని మరియు ఇది ఆరో అవతారంగా పిలవబడుతుందని పురాణాల్లో చెప్పబడినది. ఈ దత్త రూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తీభవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెబుతుంటారు.