మనము ఎన్నెన్నో సంప్రదాయాలను తెలిసో తెలియకో ఆచరిస్తూ ఉంటాము. ఇందులో అతి ముఖ్యమైనది గుడికి వెళ్లడం. అయితే ఈ గుడిలోకి వెళ్ళినప్పుడు చేసే పనులకు కారణాలు ఏంటనే విషయాలు చాలా మందికి తెలియవు. అందులో ఒక విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ విషయం ఏమిటంటే పూజ అంతా అయిపోయాక బయటికి వెళ్లే ముందు కొంచెం సేపు గుడి మండపంలో కూర్చుని స్మరణ చేస్తారు.