హిందూ సంప్రదాయంలో భాగంగా ఎంతోమంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు. దేవుని గుడిలో పూజ కార్యక్రమాలు అన్నీ పూర్తి అయిన తరువాత, ఆ గుడి పూజారి భక్తులకు ప్రసాదాన్ని లేదా దేవుడి తీర్ధాన్ని ఇవ్వడం పరిపాటి. ఈ సందర్భంలో మీరు బాగా గమనిస్తే గనుక తీర్ధాన్ని ఒక రాగి చెంబులో ఉంచి, అందరికీ అందులో నుండి పంచుతారు.