మనము ఏ శివుని ఆలయంలోకి అడుగు పెట్టగానే శివుని కంటే ముందుగా ఆ నందీశ్వరుడునే దర్శించుకుంటాము. కొందరు ఆ నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. ఇలా చేయడం వలన భక్తుల మనసులోని కోరికలు నెరవేరుతాయని వారి గట్టి నమ్మకం. అయితే నందీశ్వరుడికి ఎందు ఇంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా...అయితే మీరు ఈ కథను తెలుసుకోవలసిందే అంటున్నాయి పురాణాలు. పూర్వం శిలాదుడనే ఒక ఋషి ఉండేవాడు.