కొత్తగా ఏ పని లేదా కార్యక్రమం ప్రారంభించినా తొలుతగా ఆ విఘ్నేశ్వరునికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది మన శాస్త్రాలు చెబుతున్న ప్రతిష్టాత్మక విషయం. ఆయనను ధ్యానం చేయకుండా..ఏ దేవుడిని కొలిచినా ఫలితం శూన్యం అని చెబుతుంటారు. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందితే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ పని సక్రమంగా విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్ముతారు.