సాయిబాబా ను కొలిచే ప్రతి ఒక్కరు... ఈ వ్రతం గురించి తప్పక తెలుసుకోవాలి. కోరిన కోర్కెలు తీర్చి, కష్టాలను తొలగించి మంచి భవిష్యత్తును ప్రసాదించు ఇష్టదైవంగా సాయిబాబాను చాలా మంది భక్తులు నమ్ముతారు. సాయినాధుని క్షేత్రమైన షిరిడీకి వెళ్లి అక్కడ బాబాను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని భావిస్తారు. సాయిబాబా కు ప్రీతికరమైన రోజుగా గురువారాన్ని చెబుతుంటారు.