లక్ష్మి దేవి హిందువుల ప్రియ దేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరని ప్రతీతి. ఈమె ధనం, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా సంపదను ప్రసాదించే ధనలక్ష్మి గా ఈమెను కొలుస్తారు. ప్రతి హిందువు ఇంటిలో ఈ దేవతను తప్పకుండా పూజిస్తుంటారు.