దేవుని క్షేత్రం అంటే అది ఎక్కడైనా కాకులు ఉండడం చూస్తూనే ఉంటాము. కానీ ఇందుకు భిన్నంగా కొన్ని క్షేత్రాలలో కాకులు ఉండవట. అయితే ఒక్కో క్షేత్రంలో కాకులు లేకపోవడానికి వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇలాంటి క్షేత్రాలు ఈ కారణం చేత మంచి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటే మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్పకొండ. గుంటూరు లో ఉన్న ఎన్నో పుణ్య క్షేత్రాలలో కోటప్పకొండ కూడా ఒకటిగా ఉంది.